సంస్కారవంతులైన వ్యక్తులు ఎల్లప్పుడూ ఆర్భాటాలకూ, అట్టహాసాలకూ దూరంగానే ఉంటారు. లోకరీతి తెలియని వాళ్లనే అపవాదు వీరికేం చేదుకాదు. ఎందుకంటే వీరికి లోకనీతి తెలుసు కనుక. ధర్మం కాపాడాలనే అవ్యక్తమైన అలజడి వీరి అంతరంగాల్లో అంతర్లీనమై కొనసాగుతూనే ఉంటుంది. ఆ అలజడి వెనుక అందరూ బాగుండాలనే ఆంతర్యం అవ్యాజమానమై శోభిల్లుతుంది. చరిత్రలో అంతర్భాగమైన మహానుభావులు అంత త్వరగా అర్థం కారనేది లోకోక్తి. కానీ వారి సహృదయతను ఆకళింపు చేసుకోవడంలో ప్రయత్నలోపం కనుక ఉండకపోతే జాతి హృదయపు అరల్లో నిత్య సత్యమైన ఆకర్షణ మనల్ని తన వైపునకు లాక్కుంటుంది. యుగయుగాల చరితలో విభిన్నమైన ఆలోచన, అందరికీ మంచే జరుగాలనే సదుద్దేశం బలరాముడై కన్పించింది. భూత, వర్తమాన, భవిష్యత్తులు మన చేజేతులా లిఖించుకొని వ్యథ చెంది రోజును చూడకూడదనుకున్న వైవిధ్యత ఆ బలరామునిదనే చెప్పాలి.
కృష్ణునికి అన్న, రోహిణీ వసుదేవుల కొడుకు, యాదవులకు ఆప్తుడు, భీమ దుర్యోధనుల గురువు. కృతనిశ్చయం గల ధీరుడు. మంచిని మాత్రమే కోరుకునేవాడు. తప్పును నిక్కచ్చిగా నిలదీసేవాడు.
ద్వాపరధర్మాలైన దయ, తపస్సును వీడనివాడు బలరాముడు. ఇతని గొప్ప గుణాలు ఎంత చెప్పినా తరుగవు. బలరామునికి ఆగ్రహం వచ్చినా, అనుగ్రహం వచ్చినా తట్టుకోవడం కష్టమేనన్నది నానుడి. సంకర్షణుడనీ, బలుడనీ, బలరాముడనీ పిలుపులతో యదువంశంలో చుక్కానిలా బతికాడు.
భీమునికి మల్లయుద్ధమునూ, దుర్యోధనునికి గదా యుద్ధమునూ నేర్పించిన గురుతుల్యుడు బలరాముడు. అందుకే కురుక్షేత్రం చివరలో వీరిద్దరి మధ్య పోరును చూసి తట్టుకోలేకపోయాడు. భీమదుర్యోధనులు నాకు రెండు కళ్లలాంటివాళ్లు. వారి ప్రతాపం ప్రజల రక్షణకు ఉపయోగపడాలే గానీ పరస్పర వైరం కోసం కాదని పరితపించాడు.
కృష్ణుడు పాండవ పక్షపాతి అయితే.. బలరాముడు కౌరవుల పక్షపాతి. అలాగని అధర్మానికి సహకరించేవాడని కాదు. వారూ, వీరు మన బంధువులే కదా..
ఇద్దరి క్షేమం కోరడంలోనే న్యాయముందనేంత అమాయకత్వం బలరామునిది. ఒకసారి జాంబవతి కొడుకైన సాంబుడు హస్తినాపురానికి వెళ్లినప్పుడు అక్కడ దుర్యోధనుని కూతురు లక్షణను చూసి, ఇష్టపడి తనను పెళ్లి చేసుకోవాలనుకొని రథంపై ఎక్కించుకొని ద్వారకకు బయలుదేరుతాడు. కౌరవులకు విషయం తెలిసి అతడిని బంధించారు. ఈ విషయం తెలిసిన బలరాముడు వారితో యుద్ధం చేయడం సబబు కాదు, ఎందుకంటే వారు మన బంధువులు.
నేనే చుట్టం చూపుగా వెళ్లి విషయం చర్చిస్తానని అంటాడు. దుర్యోధనుని ఉద్దేశించి బలరాముడు మీలాంటి యోధులు చిన్న యువకుని బంధించడం సరికాదు, బంధు మర్యాద పాటించే వాడిని గనుక సావధానంగా మాట్లాడుతున్నానంటాడు. అది విన్న దుర్యోధనుడు రెచ్చిపోయి కాలికి తొడుగాల్సిన చెప్పులు తలకెక్కడం అంటే ఇదే. మీరెంత?
మీ బతుకెంత? కురువంశీయుల బంధుత్వంతో లోకంలో నామరూపాలు తెచ్చి పెట్టుకొని మాటలు చెప్పొచ్చారని అనగానే కోపంతో బలరాముడు బంధుప్రీతి వీరి పట్ల పనికి రాదని, తన నాగలితో హస్తినాపుర నగరాన్ని సగానికి చీల్చాడు. అల్లకల్లోలం మొదలైంది. కురు ప్రముఖులంతా వచ్చి క్షమాపణ కోరితే శాంతించాడు బలరాముడు.
ఉత్తర అభిమన్యుల వివాహ విందులో భాగంగా విరాటుని కొలువులో మొట్టమొదటిసారిగా బలరాముడు కౌరవ పాండవుల విషయంలో తన అభిప్రాయాన్ని ప్రకటించాడు. అంత జరిగినా బంధుత్వంలో వచ్చే విభేదాలు సమాజానికి అధర్మపు మార్గాన్ని సూచిస్తాయనీ, అది అర్థం కాని స్థితిలో లేనివారు కాదు కురుపాండవులనీ సదా బాధపడేవాడు బలరాముడు. కృష్ణుడు పాండవులు పడ్డ కష్టాలింక చాలు, ఇక తిరిగి అర్ధ రాజ్యానికి హక్కుదారులై పాండవులు బతకాలనుకున్నప్పుడు, బలరాముడు కృష్ణుడు చెప్పింది బంధుహితం. మంచి దూతను పంపి పాండవుల హక్కుగా కాక, కోరికగా అర్ధ రాజ్యాన్ని అర్థించడం మంచిదంటాడు.
బలరాముని ఆలోచనేంటంటే మళ్లీ ఈ నెపంతో కురుపాండవుల మధ్య యుద్ధం రాకూడదనే భావన. కానీ యుద్ధం తప్పలేదు. దానిని జీర్ణించుకోలేదు బలరాముడు. బంధుప్రీతి మంచినే కోరుకుంటుందనడానికి బలరాముని ఆలోచనే ప్రతీక.
ద్వేషం, కోపం, అత్యాశ కారణాలే కౌరవ పాండవుల మధ్యన కురుక్షేత్ర యుద్ధాన్ని సృష్టించాయి. అది వారి వరకే పరిమితం కాక లక్షల మంది ప్రాణాలను ఫణంగా పెట్టబోతుంది. నేను ఎవరి వినాశనాన్నీ చూడలేను. అందుకే యుద్ధానికి దూరంగా తీర్థయాత్రలకు వెళ్లిపోతానని నిశ్చయించుకున్నానని కురుపాండవుల సమక్షంలో పిలుపునిచ్చాడు బలరాముడు.
కురుక్షేత్ర సంగ్రామం భీకరంగా ముగిసింది. లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైనాయి. ప్రముఖులందరూ కన్నుమూశారు.
ఇలాంటివన్నీ వినాల్సి వచ్చినందుకు వ్యథ చెందుతూనే హస్తినకు సమీపిస్తుండగా చివరి ఘట్టంగా భీమ దుర్యోధనుల యుద్ధం కంటపడింది. భయంకరంగా దుర్యోధనుని తొడలు చీల్చుతున్న భీమున్ని వారిస్తూ అధర్మమని తన నాగలి తీసి భీమునిపైకి యుద్ధానికి వస్తే బలరాముని కృష్ణుడు వారించి క్షత్రియ ధర్మం ప్రకారం న్యాయమని సర్ది చెబితే, ఏమీ చేయలేక తన శిష్యులిద్దరూ పరస్పరం కలహించుకుంటుంటే చూడలేక ద్వారకకు తరలి వెళ్లాడు.

No comments:
Post a Comment