" ఇంద్రియాలంటే "
కళ్ళు , చెవులు, మూతి , ముక్కునా ?
" వాటిని జయించడం ఏంటి , శత్రువుల్ని జయించినట్టా ? ఇంద్రియలేవన్నా శత్రువులా ? ... ఇంతకీ వాటిని జయించేది ఎవరు ? మనసా ?.
" అబ్బే,ఆత్మ ! ఆత్మకి ఇంద్రియాలన్నీ శత్రువులేనటా ! ఇంద్రియాలు సుఖాలు మరిగి , ఆత్మకి మోక్షం రాకుండా చేస్తాయట ! అందుకే ఇంద్రియాలకు లొంగకూడదు, దేని మీద మోహము ఉండకూడదు , ద్వేషము ఉండకూడదు , దేని మీద ఆశ ఉండకూడదు , నిరాశ ఉండకూడదు , కష్టం, సుఖం ఒక్కలాగే భరించాలి , మట్టీ , బంగారం ఒక్కటే అనుకోవాలి . అలా ఉంటే జితేంద్రియుడు అవుతరన్నమాట !"
ఏడిసినట్టే ఉంది జితేంద్రియుడు అవ్వడం ! ఆశ లేకపోతే నిరాశ ఉంటుంది. నిరాశ లేకపోతే ఆశ ఉంటుంది. వెలుతురు గాకపోతే చీకటి , చీకటి గాకపోతే వెలుతురు ! చావు గాకపోతే బతుకు , బతుకు గాకపోతే చావూ ! అవి ఒక దాని కొకటి వ్యతిరేకం కాదా ? వాటిని పట్టుకుని , ' రెండూ ఒకటే ఎలా అనుకుంటాం ? అలా అనుకోడం పిచ్చి వాళ్ళకే చెల్లుతుంది. లేకపోతే , ఒక్క శరీరంలోనే ఇంద్రియాలకీ, మనసుకీ శత్రుత్వం ఏమిటి ?
This comment has been removed by the author.
ReplyDelete