Friday, 30 August 2019

అవధూత 'సన్యాసి' అంటే ఎవరు ..?

ఆధ్యాత్మిక ప్రయాణం లో తప్పక తెలుసుకోవలసిన స్దితులు : అవధూత అంటే కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారు. ఎక్కడో ఎప్పుడో ఏమరుపాటుగా వచ్చి వెళ్లి పోతూ ఉంటారు. అవధూతల గురించి తెలుసుకోబోయే ముందు సన్యాసం గురించి తెలుసుకుందాము. సన్యాసం నాలుగు రకాలు .


1. వైరాగ్య సన్యాసం :-


వ్యర్ధమైన విషయం వినడం చూడటం పై ఆశక్తి తగ్గిపోతుంది .


ప్రత్యేకించి ఇది ఇష్టం అది ఇష్టం లేదు అనే భావన ఉండదు .


అన్ని విషయాలపై మెల్లగా అనాసక్తి మొదలౌతుంది.


2. జ్ఞాన సన్యాసం :-


సత్ సాంగత్యం ద్వారా , లౌకిక వాంచలు తగ్గిపోయి


సత్యా అసత్యా విచక్షణతో జ్ఞానంతో నిత్యం కర్మలు ఆచరిస్తూ ,


ఏది తనకు అంట కుండా వసిస్తూ ఉంటాడు .

౩. జ్ఞాన వైరాగ్య సన్యాసం :-

సాధన ద్వారా , ధ్యానం ద్వారా

అభ్యసించి తనకు తానూ అన్వయించుకుని

నిత్య ఆనంద స్దితిలో జీవిస్తాడు .

4. కర్మ సన్యాసం :-

బ్రహ్మ చర్యము , గృహస్త , వానప్రస్త ఆశ్రమ ధర్మాలు నిర్వహిస్తూ ,

ఫలితాన్ని ఆశించక కర్మలు చేస్తూ వెళ్ళిపోతూ ఉండటం .

ఈ సన్యాసులు ఆరు రకాలు :-

1. కుటిచకుడు :- శిఖ, యజ్నోపవితము దండ, కమండలాలు ధరించి సంచారం చేయకుండా భక్తీ మార్గంలో వసిస్తూ అల్పాహారం తీసుకుంటూ ఉంటారు.

2. బహుదకుడు :- ఇతను రోజుకు ఎనిమిది ముద్దలు ఆహారం తీసుకుంటూ నిత్యం సాదాన చేస్తూ ఉంటారు

౩. హంస :- ఇతను జడధారియై కౌపినం ధరించి ఉంటాడు.

4. పరమహంస :- వెదుర దండాన్ని కలిగి , ఐదు గృహాల నుండి భిక్ష తెచ్చుకుని కోపినం మాత్రం ధరించి

నిరంతర సాధన లో ఉంటారు .

5. తురియాతితుడు :- దేహాన్ని ఓ శవంలా చూస్తాడు .

6. అవధూత :- ఇతనికి ఏవిధమైన నిష్ఠ నియమాలు లేవు .జగత్ మిధ్య నేను సత్యం అంటూ ,

నాశనమయ్యే ఈ శరీరం నేను కాదు. చూసే వాడికి కనిపించే ఈ రూపం నాది కాదు.

నాకు పాప పుణ్యాలు, సుఖ దుఖాలు లేవు, గర్వము మాత్సర్యము, దంభము, దర్పము, ద్వేషము,

అన్నింటిని త్యజించి ప్రాణాలు నిలుపుకోవడానికి

అగ్ని దేవుడికి కాస్త దొరికిన ఆహరం అర్పణ చేస్తూ,

దొరకని రోజు ఏకాదశి దొరికిన రోజు ద్వాదశి అంటూ

రాత్రి పగలు నిత్య ఎరుకతో సంచారం చేస్తూ పిచ్చివాడిలా తిరుగుతూ ఉంటాడు.

కర్మలు అన్ని క్షయం అయిపోయి వరించిన మోక్షం అనే కంబళి కప్పుకుని ఉంటాడు ...

( నిర్వాణ షట్కానికి ప్రతి రూపం అవధూతల మరో రూపం )

Monday, 14 May 2018

*రహస్య కుట్ర బట్టబయలు*



మోదీ పెద్ద నోట్ల రద్దు వెనుక అసలు రహస్యాన్ని ఏషియన్ పసిఫిక్ రిసెర్చ్ (ఏపీఆర్) సంస్థ బయటపెట్టింది. ప్రపంచ ఆర్దికవ్యవస్థను తన చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు అగ్రరాజ్యం అమెరికా వేసిన విషప్రయోగానికి భారత్‌ ఎలా బలైపోయిందో ఏపీఆర్ వెల్లడించింది. ”దాచిపెట్టిన రహస్యం – మోదీ చేపట్టిన క్రూరమైన నోట్ల రద్దు ప్రయోగం వెనుక వాషింగ్టన్” పేరుతో ఓ రిపోర్టును వెల్లడించింది. దీనిప్రకారం ఇప్పటికే ఆయుధ వ్యాపారంలో ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా ప్రపంచ ఆర్థిక రంగాన్ని తన ఆధీనంలో పెట్టుకునేందుకు ఎత్తు వేసింది. ఇందులో భాగంగా అమెరికా ప్రభుత్వానికి చెందిన యునైటెడ్‌ స్టేట్స్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్‌నేషనల్‌ డెవల్‌పమెంట్‌ (యుఎస్‌ఎఐడీ) రంగంలోకి దిగింది. ప్రపంచాన్ని నగదు రహితంగా మార్చి ఆన్‌లైన్‌ ద్వారా మొత్తం ప్రపంచ ఆర్దిక వ్యవస్థను వాషింగ్టన్‌లో కూర్చుని నిఘా ఉంచాలన్నది యూఎస్‌ఏఐడీ ఎత్తుగడ. ఇందులో భాగంగా అమెరికా ముందుగా ఇండియాపై కన్నేసింది. వెంటనే భారత ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపింది. ఇదంతా ఏడాది క్రితం నుంచే ఆర్బీఐ అధికారులు, ఒబామా, మోదీ మధ్య సంబంధాలను కూడా యూఎస్ ఇందుకోసం చక్కగా వాడుకుంది.

Monday, 27 November 2017

మానవాళికి అంకితం....ఆయన జీవితం...


బోదకాలు, క్షయ, కలరా, టైఫాయిడ్‌, అతిసార లాంటి వ్యాధులకు ఔషధాలు కనుగొన్నది తెలుగువాడు. అతనే యల్లాప్రగడ సుబ్బారావు. ఆ పేరు ఆధునిక వైద్యశాస్త్రానికి దిక్సూచి. ఆ పేరు మీదనే సుబ్బామైసిన్‌, సుబ్బరోమైసిన్‌ లాంటి యాంటీ బయాటిక్స్‌ తయారయ్యాయి. చిన్నప్పుడు అల్లరి చిల్లరగా ఉన్న కుర్రాడు పెద్దయ్యాక మానవాళికి మహోపకారి అవుతాడని ఎవ్వరూ అనుకోలేదు, అతడి కన్నతల్లి తప్ప!
యల్లాప్రగడ సుబ్బారావు పుట్టింది 1895లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో. నాన్న జగన్నాథం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌. సర్కారు ఉద్యోగమే అయినా చాలీచాలని జీతం. పైగా ఏడుగురు సంతానం. తండ్రి ఎంతో కష్టపడేవాడు- బతుకుబండి లాగడానికి! కానీ ఇదేమీ తెలిసేంత వయసు కాదు సుబ్బారావుది. స్కూలుకి వెళ్లాలంటే విసుగు. చదువంటే చిరాకు. క్లాసుల్ని ఎగ్గొట్టేవాడు. పుట్టల్లో గుట్టల్లో తిరిగేవాడు. 13 ఏళ్ల వయసులో కాశీకి పారిపోవాలనుకొన్నాడు. తల్లి వెంకమ్మ వారించింది. ''ఈ గాలి తిరుగుళ్లు దేనికి?పాడైపోతావ్‌ కన్నా'' అని హెచ్చరించింది.

ఇలా చేస్తే క్షణాల్లో అందమైన చిరునవ్వు

మెరిసేటి పళ్లు అందాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. ఈరోజుల్లో మనం బయట లభించే రకరకాల ఆహారాలను తింటుంటాం. దీంతో పళ్లు పాడయ్యేందుకు చాలా అవకాశాలున్నాయి. వీటిలో పళ్లు పచ్చగా మారడం, చిగుళ్ల వాపు ప్రధానమైనవి. అయితే ఈ సమస్యల నివారణకు పెద్దలు చెప్పిన ఇంటివైద్యం చక్కగా పనిచేస్తుంది. ఈ ఔషధాన్ని తయారు చేసేందుకు సాధారణంగా ఇంట్లో లభించే మూడు వస్తువులు అవసరమవుతాయి.
1. సైంధవ లవణం (లభించని పక్షంలో సాధారణ ఉప్పు)

రోజుకు 2 జిల్లేడు ఆకులతో చక్కెర వ్యాధికి చెక్.. ఎలా?

జిల్లేడు మొక్క.. దీన్నే ఆర్క లేదా మదర్ ప్లాంట్ అని కూడా అంటారు. జిల్లేడు చెట్టు నిండా పాలు ఉంటాయి. ఈ మొక్కలో మూడు జాతులు ఉన్నాయి. తెల్ల జిల్లేడు, ఎర్రజిల్లేడు, రాజుజిల్లేడు. ఈ మొక్క బీడుగావుండే అన్ని ప్రదేశాల్లో పెరుగుతుంది. ఇది చిన్న గుబురు మొక్క. ఆకులపైనా కొమ్మలపైనా తెల్లని బూడిద పొట్టు ఉంటుంది. ఈ మొక్క ఆయుర్వేద శాస్త్రంలో మెడిసన్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు.
ఈ సంప్రదాయ ఆరోగ్యప్రదాయనితో చక్కెర వ్యాధికి చెక్ పెట్టొచ్చు. అదీ రోజుకు రెండు ఆకులతోనే. పైగా, షుగర్ వ్యాధికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఓసారి పరిశీలిద్ధాం.

కొరియన్ల ధైర్యం నచ్చింది

మేం 20 మందిమి కలిసి సౌత్‌ కొరియా వెళ్లాలని టికెట్స్‌ బుక్‌ చేసుకున్నాం. కాని ఆ దేశ అధక్ష్యులు మూన్‌ జియాన్‌, అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ గారి వాగ్వివాదం వల్ల యుద్ధం సంభవిస్తుందేమో అనే భయానికి 12 మంది స్నేహితులు ఈ ప్రయాణం మానుకున్నారు. మిగిలిన ఎనిమిది మంది సౌత్‌ కొరియాకి ప్రయాణం సాగించాం. సౌత్‌ కొరియాలో అడుగుపెట్టగానే మేం టాక్సీ తీసుకొని జియాంగ్‌బాక్‌గంగ్‌ ప్యాలస్‌ కు బయలుదేరాం. అక్కడే ''నేషనల్‌ ప్లేస్‌ మ్యూజియం ఆఫ్‌ కొరియా'' వుంది. లోపలికి వెళ్ళేదారిపొడవునా ఓ పండుగ వాతావరణం నెలకొనివుంది. ఎక్కడ చూసినా వేల జనం. రంగు రంగుల దుస్తులలో సీతాకోక చిలుకల్లాగ అలంకరించుకొని, ఒకరి కొకరు మాటలతో, తుళ్లింతలతో, ఆప్యాయతతో కౌగలించుకొంటూ వారి ప్రేమను ఫొటోస్‌లో బంధించుకుంటున్నారు. 

అవధూత 'సన్యాసి' అంటే ఎవరు ..?

ఆధ్యాత్మిక ప్రయాణం లో తప్పక తెలుసుకోవలసిన స్దితులు : అవధూత అంటే కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారు. ఎక్కడో ఎప్పుడో ఏమరుపాటుగా వచ్చి వెళ్లి పోతూ ఉం...