మెరిసేటి పళ్లు అందాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. ఈరోజుల్లో మనం బయట లభించే రకరకాల ఆహారాలను తింటుంటాం. దీంతో పళ్లు పాడయ్యేందుకు చాలా అవకాశాలున్నాయి. వీటిలో పళ్లు పచ్చగా మారడం, చిగుళ్ల వాపు ప్రధానమైనవి. అయితే ఈ సమస్యల నివారణకు పెద్దలు చెప్పిన ఇంటివైద్యం చక్కగా పనిచేస్తుంది. ఈ ఔషధాన్ని తయారు చేసేందుకు సాధారణంగా ఇంట్లో లభించే మూడు వస్తువులు అవసరమవుతాయి.
1. సైంధవ లవణం (లభించని పక్షంలో సాధారణ ఉప్పు)
2. ఆవనూనె
3. పసుపు
ముందుగా సైంధవ లవణాన్ని, పసుపును కలిపి దానిలో ఆవనూనె వేసి పేస్టులా తయారు చేయండి. దానిని టూత్ పేస్టు మాదిరిగా వినియోగిస్తూ రెండు నిమిషాల పాటు బ్రష్ చేయండి. తరువాత సాధారణ నీటితో నోటిని పుక్కిలించండి. ఈ విధంగా రోజూ చేయడం వలన పంటి ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు అవి తెల్లగా మిలమిలలాడుతుంటాయి.

No comments:
Post a Comment