మనం చాలా సార్లు ఎదుటి వ్యక్తితో 'వద్దు' అని చెప్పడానికి మొహమాటపడుతుంటాం. చాలా సందర్భాల్లో మన చుట్టూ ఉన్న కొంత మంది వ్యక్తులు మనకు నచ్చకపోయినా, వాళ్లకు మన ఇంట్లో లేదా సామాజికంగా కలిసే ప్రదేశాల్లో ఆతిధ్యం ఇవ్వవలసి వస్తుంది. ఎందుచేతనంటే తప్పదు, తప్పక అలా చేయాల్సి వస్తుంది.
అయితే ఎంతో గొప్ప తత్వవేత్త అయిన చాణక్యుడి ప్రకారం ఈ క్రింద చెప్పబడిన వ్యక్తులకు ఎప్పుడు గాని ఆతిధ్యం ఇవ్వవద్దని అస్సలు వారిని గుర్తించే ప్రయత్నం కూడా చేయకండి అని చెబుతున్నాడు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది వ్యక్తులు వారి యొక్క అసలైన స్వభావాలను ఈ ప్రపంచానికి తెలియకుండా దాచేస్తుంటారు. ఇటువంటి వ్యక్తులు ఎదుటి వ్యక్తుల దగ్గర అత్యంత నమ్మకస్తులుగా ఉన్నట్లు వ్యవహరిస్తారు. కానీ వారు లేనప్పుడు లేదా వారి వెనుక, వారి గురించే చెడు మాట్లాడుతుంటారు. ఇటువంటి వ్యక్తులను ఎప్పుడు గాని మీ జీవితంలో గుర్తించే ప్రయత్నం చేయకండి. అసలు వారికి ప్రాముఖ్యత కూడా ఇవ్వకండి అని చెబుతున్నాడు చాణుక్యుడు.
ఏ వ్యక్తులైతే వారి యొక్క వ్యక్తిత్వంలో రెండు భిన్నమైన స్వభావాలు కలిగి ఉంటారో, అటువంటి వ్యక్తులు చాలా ప్రమాదకరం అని చెబుతున్నాడు చాణక్యుడు. ఇలాంటి వారు మీ ముందు మీ గురించి ఎంతో తియ్యటి మాటలు మాట్లాడతారు. కానీ మీరు లేని సమయంలో మీ గురించే పుకార్లు వ్యాప్తిచేస్తారు. ఇటువంటి వ్యక్తులకు పూర్తిగా దూరంగా ఉండండి.
ఈ ప్రపంచంలో చెడు పనులు చేసే వ్యక్తులకు కొదవ లేదు. ఇటువంటి వ్యక్తులు ఎదుటి వ్యక్తుల పై భౌతిక దాడికి దిగుతుంటారు. వేరే వ్యక్తుల యొక్క మనస్సుని, ఆలోచనలని కలుషితం చేసేలా ప్రవర్తిస్తూ వారి జీవితాలతో ఆడుకోవాలని చూస్తుంటారు. ఇటువంటి వ్యక్తులు అహంకారంతో పాటు మోసపు స్వభావాన్ని కలిగి ఉంటారు. కావున వారిని మీరు చాలా దూరంగా ఉంచండి.
ఇటువంటి వ్యక్తులు నమ్మడం మన జీవితంలో చేసే అతి పెద్ద తప్పు అవుతుంది. ఎందుకంటే, వీరు అంత నమ్మదగిన వ్యక్తులు కాదు, వెన్నుపోటు పొడుస్తారు, క్రూరంగా వ్యవహరిస్తారు మరియు ఇష్టం వచ్చినట్లు ఉంటారు. అంతేకాకుండా అప్పుడప్పుడు చిన్న చిన్న దొంగతనాలకు కూడా పాల్పడుతుంటారు. అటువంటి వ్యక్థలకు ఎప్పుడు మీ ఇంట్లో ఆతిధ్యం ఇవ్వకండి.
ఒక పాత మరియు గొప్ప నానుడి ఏమిటంటే ' అవసరంలో లేదా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే ఒక స్నేహితుడే నిజంగా నమ్మదగిన స్నేహితుడు '. ఏ వ్యక్తులైతే నిజాయితీగా మరియు నమ్మకస్తులుగా ఉంటారో అటువంటి వ్యక్తులకు ఈ నానుడి సరిగ్గా సరిపోతుంది. అయితే, ఇదే కాకుండా ఏ వ్యక్తులైతే అవసరమున్న సమయంలోనే మీ వద్దకు వచ్చి సహాయం కోరుతారో అటువంటి వ్యక్తులను అస్సలు దగ్గరకు రానియ్యకండి. మీరు అలాంటి వారిని దూరం పెట్టడం మంచిది.
మిమ్మల్ని ఎవరైతే విపరీతంగా విసిగిస్తారో లేదా కావాలనే ప్రశ్నలు అడిగి ఇబ్బందిపెడతారో లేదా వాళ్ళు ఏమి చేసినా మీరు పట్టించుకోరని చెప్పి మీ గురించి అవహేళన చేస్తారో అటువంటి వ్యక్తులు మీ జీవితంలో మీ శ్రేయోభిలాషులుగా ఉండటానికి అనర్హులు. ఇటువంటి స్వభావం ఉన్న వ్యక్తుల దగ్గరకు వెళ్లే ప్రయత్నం కూడా చేయకండి.
కొంతమంది వ్యక్తులు కావాలనే లేదా పొరపాటునో ఇతరులను గాయపరుస్తారు. అయితే కొంతమందిలో తప్పుచేశామనే భావన ఉండదు. అటువంటి వ్యక్తులను ఒకసారి క్షమించవచ్చు. కానీ, వారు ఎప్పుడైతే ఆ తప్పుని పదేపదే చేస్తూనే ఉంటారో అటువంటి వారిని చెడు వ్యక్తిత్వం గల వ్యక్తులుగా గుర్తించాలి. వారిని మీ చుట్టు ప్రక్కల ఉండనివ్వకుండా దూరం పెట్టాలి.
అటువంటి వ్యక్తులు ఎదో సాధారణంగా ఇతరులకు నష్టపరుద్దాం అని కాదు. కొన్ని సార్లు వాళ్ళు భౌతిక దాడికి దిగుతారు మరికొన్ని సార్లు ఎదుటివారి జీవితాలనే నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. అంతేకాకుండా ఇటువంటి వ్యక్తులు ఎదుటివారి మనోభావాలను అస్సలు పట్టించుకోరు. వాళ్లకు ఏది సరైనది అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్లిపోతారు. ఇటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి.
ఎవరికైతే వేదాల పై అస్సలు జ్ఞానం ఉండదో అటువంటి వారితో అస్సలు స్నేహం చేయకండి అని చెబుతున్నాడు చాణక్యుడు. ఎందుచేతనంటే వేదాలు అనేవి శక్తి కేంద్రాలు మరియు జీవితంలో ఆచరించాల్సిన, పాటించాల్సిన విలువలను నేర్పిస్తాయి. ప్రతి ఒక్కరు వేదాలను ఖచ్చితంగా నమ్మాలి మరియు ఆ పవిత్రమైన గ్రంధములను అభ్యసించి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి.

No comments:
Post a Comment