Friday, 31 March 2017

అబద్దాలు: అమ్మాయిలు-అబ్బాయిలు

 అబద్దాలు, దాని చుట్టూ ఉండే controversy లు, అది అబద్దం అని తెలిసినా తెలియనట్టు  నటిస్తూ వినటంలోని రాక్షసానందం, అబద్దాలు చెప్పేవాళ్ల ముఖకవళికలు చదవాలనే కుతూహలం, ఇలాంటి కారణాల వల్ల అపుడపుడు దానిగురించి తెలుసుకుంటూ ఉంటా. అలా తెలుసుకున్న వాటితో ఇలాంటి ఒక ఆర్టికల్ రాయాలనిపించి సరదాగా అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళు ఎక్కువగా చెప్పే అబద్దాల గురించి. కింద చెప్పిన మాటల్లో ఈ మాట చెప్పినా అబద్దం అని కాదు, చాలావరకు అబద్దం అయ్యే అవకాశం ఎక్కువ ఉంది అని అనుకుంటూ..... 

అబ్బాయిలు ఎక్కువగా చెప్పే అబద్దాలు:


  • నేను అంతేమి తాగలేదు
  • ఇదే లాస్ట్ పెగ్ 
  • ఏమి కాలేదు, బాగానే ఉన్నా 
  • ఫోన్ కి సిగ్నల్/బాటరీ లేదు, 
  • ఇదంతా ఖరీదేమి కాదే
  • దారిలో ఉన్న 
  • ట్రాఫిక్ లో ఇరుక్కుపోయా 
  • సారీ నీ కాల్ మిస్ అయ్యా 
  • సన్నగా/అందంగా కనిపిస్తున్నావు
  • ఇంతగా ఎవర్ని ప్రేమించలేదు 
  • కాల్ బిజీ వచ్చినప్పుడు (ఫ్రెండ్ తో మాట్లాడుతున్న)
  • నువ్వు నవ్వితే చాలా బాగుంటావ్ 
  • మనమే తోపు ఇక్కడ. 
  • నేనేమి ఆ అమ్మాయిని చూడటంలే
  • సిగరెట్ మానేశా/తగ్గించేసా  
  •  నేనెప్పుడూ నీ గురించే ఆలోచిస్తుంటా 
  • నిద్ర పోవట్లేదు, ఆలోచిస్తున్న
  • మర్చిపోలేదు 
  • దానిగురించి (ఏదైనా ఒక విషయం) పెద్దగా ఆలోచించను. 
  • ఆ అమ్మాయే నాకు ప్రొపోజ్ చేసింది. నాకేం పెద్ద ఇంటరెస్ట్ లేదు. 
  • 5 నిమిషాల్లో వస్తా
  • నేను చాలా సెన్సిటివ్
  • నేనే వదిలేసా ఆ అమ్మాయిని   


అమ్మాయిలు ఎక్కువగా చెప్పే అబద్దాలు:

  • ఏమి కాలేదు, బాగానే ఉన్నా 
  • అదెక్కడుందో నాకు తెలీదు, నేనసలు తాకనే లేదు 
  • ఫోన్ కి సిగ్నల్/బాటరీ లేదు
  • ఇదంత ఖరీదేమి కాదే  
  • నేను అంతేమి తాగలేదు 
  • తలనొప్పి  
  • దారిలో ఉన్నా 
  • నేనసలు ఏమి చదవనే లేదు, ఫెయిల్ అయిపోతా పక్కా
  • కాల్ బిజీ వచ్చినప్పుడు (ఫ్రెండ్/తల్లి తండ్రులు/రెలెటివ్స్ తో మాట్లాడుతున్న)
  • నువ్వు ఎవరినైనా చూసుకో నాకేమి కుళ్ళు లేదు. 
  • నిన్ను కేవలం స్నేహితునిగానే చూసా
  • నా పనుల కోసం ఎవర్ని వాడుకోవటం నాకిష్టం లేదు
  • నేనేమి అంత అందంగా ఉండనని నాకు తెలుసు
  • ఆ అబ్బాయే నాకు ప్రొపోజ్ చేసాడు. నేనసలు సరిగా చూడను కూడా లేదు/పరిచయం కూడా లేదు 
  • నేను చాలా సెన్సిటివ్
  • నేనే వదిలేసా ఆ అబ్బాయిని
  • నేనంతే అందర్నీ నమ్మేస్తా
  • నాకసలు ఈ selfie తీసుకునే అమ్మాయిలంటేనే నచ్చదు > నాలాంటిది ఎవరన్నా వచ్చి "మొన్న instagram లో పెట్టావుగా ఒకటి మూతి ముందుకి పెట్టి"? అమ్మాయి: "ఎప్పుడన్నా ఒకటి అంతే"! నేను: "ఆహా అలాగా!!"  


అందరు కలిసి చెప్పే అబద్దం "I have read and agree to the terms of use"

తనని తానే నమ్మించుకునే అబద్దం: అబద్దం చెప్పిన వాళ్ళు, మోసం చేసిన వాళ్ళ పైన మొదట ఎంత నమ్మకం ఉందో తర్వాత కూడా అంతే నమ్మకంతో ఉండగలం అని. 

నాకు నచ్చిన/తెలిసిపోయాక తప్పించుకునే అవకాశం ఉన్న/నేను చెప్పే అబద్దం: "అబద్దం చెప్పలేదు, నిజం దాచ అంతే." 


No comments:

Post a Comment

అవధూత 'సన్యాసి' అంటే ఎవరు ..?

ఆధ్యాత్మిక ప్రయాణం లో తప్పక తెలుసుకోవలసిన స్దితులు : అవధూత అంటే కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారు. ఎక్కడో ఎప్పుడో ఏమరుపాటుగా వచ్చి వెళ్లి పోతూ ఉం...