Friday, 31 March 2017

స్నానం చేయ్యకుండా దీపం పెట్టడం..పూజలు.. చెయ్యొచ్చా…?


మన పూర్వీకులు స్నానానికి అధిక ప్రాధ్యాన్యత నిచ్చారు. ఆరోగ్య పరంగానే కాదు, ఆధ్యాత్మిక పరంగా కూడా స్నానానికి ప్రత్యేక స్థానం ఉంది. స్నానం చేయడం వల్ల శరీరం శుభ్రపడటంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు. కొంత మందికి పూజ చేయడానికి ముందు స్నానం చేయాలా అని అనుమానం వస్తుంది. మన దినచర్య అంతా సజావుగా సాగిపోతున్నప్పుడు మన మనసూ, శరీరం పరిశుభ్రంగా వున్నప్పుడే పూజ చెయ్యాలి. అసలు స్నానం చెయ్యకుండా పూజ చెయ్యకూడదు. కానీ కొన్ని సందర్భాలలో రోజూ స్నానం చెయ్యలేక పోవచ్చు. దూర ప్రయాణాలలోకానీ, జబ్బుచెయ్యటవల్లకానీ, ఏదైనా ఆపరేషన్ అయినప్పుడుకానీ, వృధ్ధాప్యంలో మంచం మీద నుంచి కదలలేక కానీ స్నానం చేసే పరిస్ధితుల్లో వుండక పోవచ్చు. అలాంటప్పుడు పూజ మానక్కరలేదు.


. మానసిక పూజనికూడా భగవంతుడు స్వీకరిస్తాడండీ. వీలయితే తడిగుడ్డతో ఒళ్ళు తుడుచుకుని బట్టలు మార్చుకుని, మగవారయితే భస్మాన్ని ధరించి, ఆడవారయితే పసుపు నీరు పైన చిలకరించుకుని, మానసిక పూజ చేసుకోవచ్చు.
. స్నానం చేయ్యకుండా బాహ్యంగా చేసే పూజలు, దీపారాధన, అభిషేకాలు, గుళ్ళోకెళ్ళటం వగైరాలు చెయ్యకూడదు.
. కానీ మనసులో దీపారాధన చెయ్యవచ్చు, పూజలూ, అభిషేకాలూ, చేసుకోవచ్చు, నైవేద్యాలు పెట్టవచ్చు.అన్ని మానసికంగా చెయ్యవచ్చు. వృధ్ధాప్యంలో బాహ్యంగా పూజలు చేసే శక్తి లేక పోవచ్చు.వారు అలవాటయిన తమ పూజా విధానాన్ని మానసికంగా చేసి తృప్తి చెందవచ్చు.
. ఏ వయసు, ఏ మతం, ఏవర్గం వారికైనా మానసిక పూజ చెయ్యటానికి స్నానంతో సంబంధం లేదు.
. మామూలుగా ఉదయం నిద్ర లేవగానే ఆరోగ్యవంతులు కూడా పక్కమీదనుంచి దిగే ముందు మానసికంగా దైవస్మరణ చేశాకే దిగాలి.
. మనం ఎక్కడ వున్నా, ఏ పరిస్ధితుల్లో వున్నా, మానసికంగా భగవన్నామ స్మరణ చేసుకోవచ్చు.

No comments:

Post a Comment

అవధూత 'సన్యాసి' అంటే ఎవరు ..?

ఆధ్యాత్మిక ప్రయాణం లో తప్పక తెలుసుకోవలసిన స్దితులు : అవధూత అంటే కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారు. ఎక్కడో ఎప్పుడో ఏమరుపాటుగా వచ్చి వెళ్లి పోతూ ఉం...