దశరథుడు :- దశరథుడు కోపం తో మండిపడుతూ ఎంత దుష్టురాలివైపోయవే ! రాముణ్ణి కష్టపెడుతున్నావ్ అని కైకను తిడ్తుంటే కైక అన్న మాటలు .
కైక :- రాముణ్ణి కష్టాలు పెట్టేది నేను కాదు నువ్వు ! అతడు నిన్ను పూజించే కష్టాలు తెచ్చుకున్నాడు. రాజ్యం కోసం నీతో మంత్రాంగం చేసి తన కష్టాలు తనే తెచ్చుకున్నాడు. లక్ష్మనున్నో ,శథ్రుగ్నున్నొ అడవులకు పంపమని కోరాన ? తనకు హక్కు లేని రాజ్యాన్ని తీసుకోడానికి అతడెందుకు సిద్ధపడాలి ? అయిన రాముడు స్థిత ప్రజ్ఞుడు అంటారే ఋషులు ! సుఖానికి సంతోషించడని, కష్టానికి దు:ఖించాడని కీర్తిస్తారే ! అంత స్థిత ప్రజ్ఞుడికి రాజ భోగలైతే ఏమిటి , వనవాసం అయితే ఏమిటి ? అటువంటి వాడికోసం మీరంతా ఇంతగా దు:ఖిస్తరేంన్దుకు ? అని తీక్షణంగా చూసింది కైక .
No comments:
Post a Comment