Tuesday, 24 May 2016

జితేంద్రియుడు అంటే ఇంద్రియాలను జయించిన వాడంట !

" ఇంద్రియాలంటే "

కళ్ళు , చెవులు, మూతి , ముక్కునా ?

" వాటిని జయించడం ఏంటి , శత్రువుల్ని జయించినట్టా ? ఇంద్రియలేవన్నా శత్రువులా ? ... ఇంతకీ వాటిని జయించేది ఎవరు ? మనసా ?.

  " అబ్బే,ఆత్మ ! ఆత్మకి ఇంద్రియాలన్నీ  శత్రువులేనటా ! ఇంద్రియాలు సుఖాలు మరిగి , ఆత్మకి మోక్షం రాకుండా చేస్తాయట ! అందుకే ఇంద్రియాలకు లొంగకూడదు, దేని మీద మోహము ఉండకూడదు , ద్వేషము ఉండకూడదు , దేని మీద ఆశ ఉండకూడదు , నిరాశ ఉండకూడదు , కష్టం, సుఖం ఒక్కలాగే భరించాలి , మట్టీ , బంగారం ఒక్కటే అనుకోవాలి . అలా ఉంటే జితేంద్రియుడు అవుతరన్నమాట !"

ఏడిసినట్టే ఉంది జితేంద్రియుడు అవ్వడం ! ఆశ లేకపోతే నిరాశ ఉంటుంది. నిరాశ లేకపోతే ఆశ ఉంటుంది. వెలుతురు గాకపోతే చీకటి , చీకటి గాకపోతే వెలుతురు ! చావు గాకపోతే బతుకు , బతుకు గాకపోతే చావూ ! అవి ఒక దాని కొకటి వ్యతిరేకం కాదా ? వాటిని పట్టుకుని , ' రెండూ ఒకటే ఎలా అనుకుంటాం ? అలా అనుకోడం పిచ్చి వాళ్ళకే చెల్లుతుంది. లేకపోతే , ఒక్క శరీరంలోనే ఇంద్రియాలకీ, మనసుకీ శత్రుత్వం ఏమిటి ?    

1 comment:

అవధూత 'సన్యాసి' అంటే ఎవరు ..?

ఆధ్యాత్మిక ప్రయాణం లో తప్పక తెలుసుకోవలసిన స్దితులు : అవధూత అంటే కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారు. ఎక్కడో ఎప్పుడో ఏమరుపాటుగా వచ్చి వెళ్లి పోతూ ఉం...