కైరో: ఈజిప్టులో ఉగ్రవాదులు పంజావిసిరారు. మసీదులో ప్రార్థన చేసుకుంటున్న భక్తులపై కాల్పులకు తెగబడ్డారు. ఈఘటనలో 235 మంది మృతి చెందగా, మరో 120 మంది తీవ్రంగా గాయ పడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... సినారు ప్రావిన్స్‌లోని బిర్ అల్-ఆబెద్ నగరంలోని మసీదులో శుక్రవారం ఉగ్రదాది జరిగింది. సాయుధులైన మిలిటెంట్లు మసీదులోకి చొరబడి ప్రార్థన చేస్తున్న వారిపై కాల్పు లకు తెగబడ్డారు. మసీదు ప్రాంగణంలో బాంబులు విసిరారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 235 మంది మృతి చెందారు. ప్రాణభయంతో ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అంబు లెన్స్‌లు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్ప త్రులకు తరలించాయి. అయితే, అంబులెన్స్‌లో తరలి స్తున్న క్షతగాత్రులపై కూడా మిలిటెంట్లు కాల్పులకు పాల్పడినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడినట్టు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటిం చుకోలేదు.
మసీదులో ప్రార్థన చేస్తున్న భద్రతాబలగా లను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఈ ఘాతుకా నికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈఘటనపై దర్యాప్తునకు ఆదేశిం చినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతాV్‌ా అల్-సిసీ ఘటనా స్థలాన్ని సంద ర్శించారు. మృతుల కుటుం బాలకు ప్రగాఢ సాను భూతి తెలిపారు.
ఈ దాడికి నిరసనగా ఈజిప్టు ప్రభు త్వం మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటిం చింది. కాగా, 2013 నుంచి ఈజిప్టులో చొరబాటు కోసం ఐఎస్ ప్రయత్నిస్తోంది. 2013లో మహ్మద్ మోర్సీని అధ్యక్ష పదవి నుంచి తొలగించడంలో ఈజిప్టు సైన్యం కీలక పాత్ర పోషించింది. ఇస్లాం మతస్తుడైన, తమకు అండదండలిచ్చిన అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించడం పట్ల ఐఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అప్పటి నుంచి పోలీసులను, భద్రతా బలగాలను, పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నది. మిలిటెంట్ల దాడుల్లో వందలాది మంది మృతి చెందారు.

No comments:
Post a Comment